మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన మంత్రి అడ్లూరి..

by Kodari Anjali |

బాచుపల్లిలో నిర్మించిన మహిళా డిగ్రీ కళాశాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంగళవారం పరిశీలించారు.

మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన మంత్రి అడ్లూరి..
X

దిశ, కుత్బుల్లాపూర్: బాచుపల్లిలో నిర్మించిన మహిళా డిగ్రీ కళాశాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మంగళవారం పరిశీలించారు. డిగ్రీ కళాశాల నిర్మించి సవంత్సరం గడుస్తున్నా పక్కనే డంపింగ్ యార్డ్ సమస్య వల్ల కళాశాలలో అడ్మిషన్స్ తీసుకోలేదు. కళాశాల సిబ్బంది మంత్రి దృష్టికి ఇక్కడి సమస్యను తీసుకువెళ్లడంతో మంత్రి డిగ్రీ కళాశాలను సందర్శించి సమస్య తీవ్రతను పరిశీలించారు. చెత్త డంపింగ్ సమస్య వల్ల ఇక్కడీ కళాశాలలో విద్యార్థులు చేరే పరిస్థితి లేదని డంపింగ్ యార్డ్ ను ఇక్కడి నుండి తరలించాలని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన మంత్రి డంపింగ్ యార్డ్‌ను ఇక్కడి నుండి తరలించే ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. డంపింగ్ యార్డ్‌ను తరలించేందుకు నెల రోజుల సమయం కావాలని మంత్రిని ఫోన్‌లో సైబరాబాద్ కమిషనర్ కోరగా 15 రోజుల వ్యవధిలో ఈ సమస్య పూర్తిగా పరిష్కరించాలని సీఎంసీ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, మల్కాజిగిరి ఆర్డీఓ శ్యామ్, నిజాంపేట్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ సాబీర్ అలీ, బాచుపల్లి తహసీల్దార్ వాణి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి, సీనియర్ నాయకుడు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జీవన్ రెడ్డి, ఆగం శంకర్, సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story