- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సిఎంసి వద్ద కార్మికుల భారీ ధర్నా..
మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, డైలీవేజ్ కార్మికులందరినీ తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు.

దిశ, మేడ్చల్ బ్యూరో: మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, డైలీవేజ్ కార్మికులందరినీ తక్షణమే పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ, రాత్రింబగళ్లు శ్రమిస్తూ నగర పారిశుద్ధ్యానికి కారకులవుతున్న మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. దిల్లీ, హర్యానా తరహాలోనే ఇక్కడి కార్మికులను పర్మినెంట్ చేయాలని, జీహెచ్ఎంసీతో సమానంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి జై చంద్రశేఖర్ మాట్లాడుతూ, కార్మికులపై అధికారుల వేధింపులు ఆపాలని, మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని కోరారు. మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల బీమా, వారంతపు సెలవులు, 8 గంటల పనిదినం, బయోమెట్రిక్ హాజరు విధానంలో మార్పులు, అర్హులైన కార్మికులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని నాయకులు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎం. శ్రీనివాస్, జె. వెంకటేష్, ఉన్నికృష్ణ, గణేష్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.






