- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
నిజాంపేట్ పెట్రోల్ బంక్ సమీపంలో భారీ పేలుడు...

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్ హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో భారీ పేలుడు జరిగింది.పెట్రోల్ బంక్ పక్కనే గల జిమ్ ఫిట్నెస్ స్టూడియో పక్కనే కొందరు నిబంధనలకు విరుద్దంగా గతంలో షాప్స్ ఏర్పాటు చేసి లీజ్ కి ఇచ్చారు. అయితే ఈ దుకాణాలలో గల మూడు సిలిండర్లు ఒక్కొక్కటిగా భారీ శబ్దంతో పేలి విస్ఫోటనం జరగడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాద ఘటనకు అతి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగుతుందో అని స్థానికులు కలవరపడ్డారు. షాప్స్ లోని సిలిండర్లు పేలి మంటలు అంటుకోవడం గమనించిన దుకాణాల నిర్వాహకులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది. స్థానికులు పోలీసులకు, ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఆలోపే మూడు షాపులు కాలి బూడిద అయ్యాయి.బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.