యాప్రాల్‌లో వివాహిత అదృశ్యం..

by Kodari Anjali |   (  Updated:2026-06-09 16:19:16  IST  )

ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ వివాహిత యాప్రాల్‌లో అదృశ్యమైంది.

యాప్రాల్‌లో వివాహిత అదృశ్యం..
X

దిశ, జవహర్నగర్: ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ఓ వివాహిత యాప్రాల్‌లో అదృశ్యమైంది. ఈ ఘటన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్హెచ్ఓ సైదులు తెలిపిన కథనం ప్రకారం... వెస్ట్ బెంగాల్‌కు చెందిన దంపతులు ఆదేశ చెట్టారి, భార్య ఆయేషారాయ్ కలసి యాప్రాల్‌లో నివాసముంటున్నారు. స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 1న భర్త చెట్టారి పనులకు వెళ్ళి ఇంటికి రాగా భార్య ఆయేషారాయ్(25) కనిపించలేదు. దీంతో ఆమె ఆచూకి కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికిన సమాచారం లభించలేదు. ఈ మేరకు భర్త చెట్టారి జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story