నయా కబ్జా @ కుత్బుల్లాపూర్

by Dishafeatures2 |
నయా కబ్జా @ కుత్బుల్లాపూర్
X

దిశ, కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సూరారం సర్వేనంబర్ 107లో గల ప్రభుత్వ స్థలాన్నిఅధికారుల అండదండలతో ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని స్థానికులు ఆరోపించారు. వర్క్ ఆర్డర్ లేకుండానే అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని, ఎమ్మెల్యే మంజూరు చేశారని కొత్తగా కబ్జాకు తెరలేపారని, ప్రభుత్వమే చేపట్టిందని చెబితే ఎవరూ ప్రశ్నించరనే ధీమాతో దర్జాగా ఆక్రమణ చేశారని స్థానికులు ఆరోపించారు. ప్రభుత్వ స్థలం అన్యాక్రాంమవుతోందని స్థానిక ఎమ్మార్వోకు ఫిర్యాదు చేస్తే .. కనీసం పరిశీలించకుండా ఫిర్యాదు చేసిన వారినే దబాయించారని చెప్పారు. ''ఎక్కడి నుంచో వలస వచ్చిన మీరు ప్రభుత్వ స్థలాన్ని కాపాడమనడం ఏంటీ'' అని ఎమ్మెర్వో ఆగ్రహం వ్యక్తం చేశారని, అంతటితో ఆగకుండా రాద్దాంతం చేస్తే తమ ఇళ్లను కూల్చివేస్తామంటూ ఎమ్మార్వో బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఈ క్రమంలోనే తమపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారని స్థానికులు వాపోయారు. ''బంగారు తెలంగాణలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఇదేం చట్టం? చదువుకున్న ఎమ్మెల్యే అయితే అంగన్వాడీ కేంద్రం ఏర్పాటు వర్క్ ఆర్డర్ చూపించాలి కదా? ఇదో కొత్తరకం కబ్జాలను ప్రోత్సహిస్తున్నారా ?'' అని ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ స్థలం కాపాడాలని ఫిర్యాదు చేసినందుకే ఫిర్యాదుదారులనే అరెస్ట్ చేసిన వైనం దుండిగల్ పోలీసులకే చెల్లిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed