రికార్డ్.. బాలాపుర్​లడ్డూ కన్నా రెట్టింపు ధర పలికిన కానాజీగూడ గణపతి లడ్డూ

by Dishanational1 |
రికార్డ్.. బాలాపుర్​లడ్డూ కన్నా రెట్టింపు ధర పలికిన కానాజీగూడ గణపతి లడ్డూ
X

దిశ, అల్వాల్: నగరంలో ఎక్కడాలేనివిధంగా అత్యంత ఎక్కువ ధరకు గణనాథుని లడ్డును గీతప్రియా వెంకట్రావ్​దంపతులు సొంతం చేసుకున్నారు. నగరంలో బాలాపూర్ లడ్డే అధికం అనుకుంటే దానికి డబుల్​ధరతో అల్వాల్​సర్కిల్​కానాజీగూడలోని మరకత లక్ష్మీగణపతి ఆలయంలో ఏర్పాటు చేసిన గణపతి లడ్డూ వేలంలో ధర పలికింది. బాలాపూర్​ లడ్డూ రూ.24.60 లక్షలు పలుకగా మరకత లక్ష్మీగణపతి లడ్డూ వేలం ధర రూ.45 లక్షల 99 వేల తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయాలు పలికిందని ఆలయ కార్యనిర్వాహకులు డాక్టర్ మోత్కూరి సత్యనారాయణ శాస్త్రీ తెలిపారు. ఈ లడ్డూను గీత ప్రియ వెంకట్రావ్​దంపతులు కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం సైతం లడ్డూ వీరికే దక్కడం గణపతి కృప వల్లనే సాధ్యం అయిందని ఆయన కటాక్షం వల్లనే తాము ఉన్నత స్థాయిలో ఉన్నామని వెంకట్రావ్ దంపతులు తెలిపారు. ఆ డబ్బుతో ఆలయం ఆధ్వర్యంలో జరుగు నిత్య అన్నదానానికి, ఆలయ అభివృద్ధికి, ఆలయానికి కావాలసిన స్థల సేకరణకు వినియోగిస్తామని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed