గుంతలమయంగా మారిన జయదర్శిని రోడ్డు..

by Disha Web Desk 23 |
గుంతలమయంగా మారిన జయదర్శిని రోడ్డు..
X

దిశ,మేడ్చల్ టౌన్: మేడ్చల్ పట్టణ కేంద్రంలోని 3వ వార్డ్ పరిధిలో గల జయ దర్శిని రోడ్డు గుంతలమయంగా మారడంతో అటువైపు వెళ్లే ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పలుమార్లు చిన్న చితక మరమ్మత్తులు చేపట్టిన రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. గత రాత్రి ఈదురు గాలులకు చిన్నపాటి వర్షానికి రోడ్డు బురదమయంగా మారింది. నిత్యం వందలాది వాహనాలు ప్రజలు తిరిగి రోడ్డు దుస్థితి అధ్వానంగా మారింది. ఇదే మార్గంలో క్రిక్ స్కూల్, హైటెక్ వ్యాలీ స్కూల్ ఉంది. రోజు పాఠశాల విద్యార్థులను తరలించే బస్సులు తిరుగుతుంటాయి. రాఘవేంద్ర స్వామి కార్నర్ వద్ద పెద్ద గుంతలు ఏర్పడి మలుపు వద్ద ప్రమాదకరంగా మారింది. ఈ విషయంలో అధికారులు తక్షణమే స్పందించి గుంతలను పూడ్చి అవసరం మేరకు మరమ్మతులు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు అలాగే చినుకు పడితే చిత్తడి గా మారుతున్న ఈ మార్గంలో శాశ్వత మైన మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story