ఈటలకే మల్కాజ్‌గిరి టికెట్

by Naresh N |
ఈటలకే మల్కాజ్‌గిరి టికెట్
X

దిశ , మేడ్చల్ బ్యూరో: మల్కాజిగిరి లోక్‌సభ టికెట్ మాజీ మంత్రి ఈటల రాజేందర్ కే దక్కింది. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ విడుదల చేసిన మొదటి విడత పార్లమెంట్ అభ్యర్థుల జాబితాలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ ప్రకటించారు. దీంతో ఆయన కార్యకర్తలు, అభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

ఈటల ప్రస్థానం ఇది..

2004 శాసనసభ ఎన్నికల్లో కమలాపూర్ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో డ బీఆర్ఎస్ ఎల్పీ నేతగా ఉన్నారు. 2009లో జరిగిన నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా కమలాపూర్ నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం రెండుగా ఏర్పడటంతో ఆయన హుజురాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంలో ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 2019లో రెండోసారి ప్రభుత్వం ఏర్పడటంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు. 2021లో కేసీఆర్‌తో నివేదించి పార్టీ నుంచి బయటికి వచ్చి బీజేీపి పార్టీలో చేరారు. అనతి కాలంలోనే బీజేపీ కార్యనిర్వాహక సభ్యుడిగా ఎన్నికవడం తో పాటుగా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2023లో బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులయ్యారు. తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికలను హుజురాబాద్ , గజ్వేల్ రెండు అసెంబ్లీ సెగ్మెంట్ ల నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

తీవ్ర నిరాశలో టికెట్ ఆశించిన అభ్యర్థులు

అయితే మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మీరు తెలుగు రాష్ట్రాల ఓటర్లతో పాటుగా నార్త్ ఇండియాకు చెందిన అధిక సంఖ్యలో ఓటర్లు ఇక్కడ నివాసం ఉన్నారు. దీంతో ఇక్కడ బీజేపీ పార్టీ ఎంపీ సీటు సులువుగా గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయి. దీంతో బీజేపీ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేసేందుకు మురళీధరరావు, కూన శ్రీశైలం గౌడ్‌, మల్క కొమరయ్య, చాడ సురేష్ రెడ్డి, జే.రామకృష్ణ, ఎస్.మల్లారెడ్డి, రామచంద్రరావు, పన్నాల హరీష్ రెడ్డి, తదితరులు ఆసక్తి చూపించారు. కానీ అధిష్టానం ఈటల రాజేందర్ వైపు మొగ్గు చూపడంతో టికెట్ ఆశించిన అభ్యర్థులకు నిరాశ ఎదురైంది.



Next Story

Most Viewed