అక్రమ నిర్మాణాలకు అడ్డేదీ..?

by Disha Web Desk 11 |
అక్రమ నిర్మాణాలకు అడ్డేదీ..?
X

దిశ, మల్కాజిగిరి: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. మల్కాజిగిరి, మౌలాలీ, గౌతంనగర్, ఈస్ట్ ఆనంద్ బాగ్, వినాయక్ నగర్, నేరేడ్ మెట్ డివిజన్ల పరిధిలోని పలు కాలనీల్లో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇంటి అనుమతులు తీసుకొని, కమర్షియల్ గా మార్చడంతో పాటు సెట్ బ్యాక్ లు లేకుండా, ఇష్టానుసారంగా అదనపు అంతస్తుల నిర్మాణాలు కొనసాగిస్తున్నారు. యాప్రాల్ సీబీఆర్ కిష్ణవేణి కాలనీలో బారీ షెడ్డు నిర్మాణం చేపట్టారు. మౌలాలీ డివిజన్ పరిధిలోనీ ఎస్పీనగర్ చౌరస్తాలోని ఓ హోటల్ పక్కనే అదనపు అంతస్తుల నిర్మాణాన్ని చేపడుతున్నారు.

కుషాయిగూడ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఓ పాత కార్పొరేట్ పాఠశాల భవనానికి చుట్టూ అదనంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

టౌన్ ఫ్లానింగ్ అధికారుల అవినీతిపై ఎమ్మెల్యే ఫైర్ ...

మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల వ్యవహారంలో పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు అధికారులు తమ ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. నిర్మాణదారుల వద్ధ లక్షల రూపాయలు వసూలు చేస్తున్న అధికారులకు ఎమ్మెల్యే ఫోన్ లో క్లాస్ పీకారు. అవినీతికి పాల్పడే అధికారులు తమ నియోజకవర్గంలో ఉండవద్ధని బదిలీ చేయించుకుని వెళ్లాలని హెచ్చరించారు.


Next Story

Most Viewed