జోరుగా వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా.. డెలవరీకి ఐదురోజులా?

by Dishanational2 |
జోరుగా వంట గ్యాస్ సిలిండర్ల అక్రమ దందా.. డెలవరీకి ఐదురోజులా?
X

దిశ,ఉప్పల్: నిత్య అవసరాలకు వాడుకునే వంట గ్యాస్ కమర్షియల్‌గా వాడుతున్నారు అని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం నుంచి పడుకునే వరకు ఒక ఇంట్లో గ్యాస్ తో పని ఉంటది. నిత్యం గ్యాస్ లేనిదే ఇంట్లో ఎలాంటి పనులు కావు, అలాంటిది గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే గ్యాస్ ఇంటికి రావడానికి ఐదు రోజులు పడుతుంది. ఒక ఫాస్టుఫుడ్ సెంటర్ కానీ రెస్టారెంట్స్, హోటల్స్,టీ షాప్స్ కానివ్వండి ఒక గంటలో గ్యాస్ డెలివరీ చేస్తున్నారు. ఒక ఇంటికి గ్యాస్ సిలిండర్ డెలివరీ కావాలి అంటే మాత్రం ఐదు రోజులు టైం పడుతుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకు అంటే అక్రమంగా గ్యాస్ సిలిండర్స్ బయట అమ్ముకుంటున్నారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదంతా గ్యాస్ ఏజెన్సీస్ లకు తెలిసి నడుస్తుందా లేక గ్యాస్ డెలివరీ చేసే బాయ్స్ చేస్తున్నారా అన్నది ప్రశ్నార్థకం. దీనికి సంబంధించిన అధికారులు మాత్రం నిద్ర మత్తులో ఉండి చోద్యం చూస్తున్నారు అని అధికారుల మీద ఆరోపణలు వస్తున్నాయ్. వారు చర్యలు తీసుకోకపోవడమే కాకుండా అసలు ఎలాంటి గ్యాస్ ఏజెన్సీలను తనిఖీ చేయడం లేదనీ దీనివలన రోజు రోజుకు గ్యాస్ సిలిండర్ల అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఇది ఇలా పొగ గ్యాస్ డెలివరీ చేసిన బాయ్స్ మాత్రం అక్రమంగా అడ్డగోలుగా సంపాదిస్తున్నారు.

ఇంటికి వచ్చి గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తే బిల్ మీద ఉన్నదాని కంటే 30 రూపాయల నుండి అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఒకవేళ ఇవ్వకుంటే గ్యాస్ సిలిండర్ లేట్ గా డెలివరీ చేయడం, లేదంటే మేము వచ్చాము మీ ఇంటికి డోర్ లాక్ ఉంది అని రోజులు గడుపుతూ ఆలస్యంగా డెలివరీ చేస్తున్నారు. ఒకవేళ ఫోన్ చేసి ఇంకా గ్యాస్ డెలివరీ కాలేదు అని అడుగుతే, అవునండి అటు వైపు ఎం డెలివరీ‌లు లేవు మీ ఒక్కదానికోసం రాలేము ఒక రోజు కానీ రెండు రోజులు కానీ టైం పడుతదనీ సమాధానం చెప్తున్నారు అని ప్రజలు బాధ వెళ్ళబుచ్చుకుంటున్నారు. ఇలా చేయడం వలన సామాన్య ప్రజలకూ సరైన టైం లో గ్యాస్ సిలిండర్ అందకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్తున్నారు.

ముడుపుల మత్తులో ఉన్నత అధికారులు..

నిత్య అవసరాలకు వాడుకునే వంట గ్యాస్ కమర్షియల్ గా వాడుతుంటే ఉన్నత అధికారులు నిద్ర మత్తులో ఉన్నారా లేక ముడుపుల మత్తులో ఉన్నారా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ అక్రమంగా అమ్ముతుంటే ఎందుకు అధికారులు పట్టించుకుంటాలేరు అంటే ఎంతో కొంత అధికారులకు కూడా ముడుపులు అందడం వల్లనే ఎలాంటి తనిఖీలు చేయకుండా నిద్ర పోతున్నారు అని ఆరోపణలు వేళ్ళువేత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు వంట గ్యాస్ సిలిండర్స్ ను కమర్షియల్ వాడుతున్న వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


Next Story