భూ వివాదంలో వేధింపులు.. కాపాడాలంటూ సీఐకి లేఖ రాసి వ్యక్తి అదృశ్యం

by Shiva |
భూ వివాదంలో వేధింపులు.. కాపాడాలంటూ సీఐకి లేఖ రాసి వ్యక్తి అదృశ్యం
X

దిశ, దుండిగల్: గ్రామంలో తనకు ఉన్న వ్యవసాయ భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులకు లేఖ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బౌరంపేట గ్రామానికి చెందిన వంపుగూడెం మాధవరెడ్డి కుటుంబానికి దొమ్మర పోచంపల్లి గ్రామంలోని సర్వే నెం.1882లో ఎకరం 13 గుంతల తన పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమి ల్యాండ్ మార్క్ అనే వెంచర్ మధ్యలో ఉంది. అయితే, ఆ వెంచర్ నిర్మాణ సంస్థ తమ పలుకుబడిని ఉపయోగించి మాధవరెడ్డి భూమిని తక్కువకు ధరకు కొట్టేసేందుకు ప్రయత్నించడంతో అతడు ఒప్పుకోలేదు. ఎలాగైనా భూమిని కొట్టేసేందుకు ల్యాండ్ మార్క్ సంస్థ ఓనర్ పసుపులేటి సుధాకర్, నిజాంపేట కార్పొరేటర్ మేకల వెంకటేశం బీఆర్ఎస్ నాయకులు కలిసి గ్రామస్తులను ఉసిగొలిపారు. దీంతో తీవ్ర మనస్తాపానాకి గురైన బాధితుడు మాధవరెడ్డి దుండి‌గల్ పోలీస్ స్టేషన్ సీఐకు లెటర్ రాసి మంగళవారం అదృశ్యమయ్యాడు.

లేఖ సారాశం ఇలా..

భాధిత రైతు, సీఐ శంకరయ్యకు లెటర్ రాసిన లేఖలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాను భూ వివాదంలో విసిగిపోయానని పోలీసులకు ఎన్నిసార్లు విన్నవించినా తనకు న్యాయం జరగలేదంటూ గోడు వెల్లబోసుకున్నాడు. తన కుటుంబాన్ని కాపాడాలని, అమ్మ, నాన్న, పిల్లలు తనను క్షమించాలని వేడుకున్నాడు. తనను కష్టపెట్టిన నిజాంపేట కార్పొరేటర్ మేకల వెంకటేశం, త్రిపుర ల్యాండ్ మార్క్ ఓనర్ పసుపులేటి సుధాకర్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ లెటర్ రాసి ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ః

మంగళవారం ఉదయం ఇంట్లో లెటర్ చూసిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఆచూకీ కొరకు చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికారు. అక్కడ లేకపోవడంతో స్నేహితుల వద్ద వెతికిన ఫలితం లేకపోవడంతో దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మాధవరెడ్డి కోసం గాలిస్తున్నారు. కాగా, అదృశ్యమైన అతడి ఫోన్ ఇంటి వద్దే ఉంచి వెళ్లడంతో ఆచూకీ కనుక్కోవడం కష్టతరంగా మారింది. మాధవరెడ్డి ఇంటి చుట్టు పరిసరాల్లో ఉన్న సీసీ కెమెరాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్న పోలీసులు ఎక్కడికి వెళ్లాడో అనే విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఈ క్రమంలోనే అతడి కుటుంబ సభ్యులు దుండిగల్ పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. భూ వివాదంలో గత రెండు నెలల క్రితం ఇరువురిపై కేసులు నమోదు కాగా 15 రోజులు జైలులో ఉన్న బాధితుడు కండీషన్ బెయిల్‌పై బయటికు వచ్చాడు. పసుపులేటి సుధాకర్ రెడ్డి, తదితరులకు మాత్రం అంటిసిపేటరీ బెయిల్ లభించింది. పోలీసులు సంపన్నులకే వత్తాసు పలుకుతున్నారని అందుకే ల్యాండ్‌మార్క్ ఓనర్‌ను అరెస్ట్ చేయకుండా బెయిల్ తెచ్చుకున్నంత వరకు కాపాడారని ఆరోపించారు. మాధవ రెడ్డికి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ల్యాండ్‌మార్క్ యజమాని పసుపులేటి సుధాకర్, నిజాంపేట్ కార్పొరేటర్ మేకల వెంకటేశం‌, బీఆర్ఎస్ నాయకులదేనని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed