ఉప్పల్ టీఆర్ఎస్‌లో భగ్గుమంటున్న వర్గపోరు.. తెరపైకి కుల రాజకీయాలు

by Dishanational2 |
ఉప్పల్ టీఆర్ఎస్‌లో భగ్గుమంటున్న వర్గపోరు.. తెరపైకి కుల రాజకీయాలు
X

దిశ, కాప్రా : కాప్రా సర్కిల్ చర్లపల్లి డివిజన్ టీఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు భగ్గుమంటోంది. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవిల మధ్య గత మూడేళ్లుగా విభేదాలు కొనసాగుతునే ఉన్నాయి. ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో తనుకు తగిన ప్రాధాన్యత కల్పించడం లేదని కార్పొరేటర్ బొంతు శ్రీదేవి ఆరొపిస్తున్నారు. తనను గొల్లెక్కిరిది అంటూ భూతులు తిడుతూ అడుగడుగునా కించపరుస్తున్నాడని కార్పొరేటర్ కన్నీటిపర్యంతమైంది. కార్పొరేటర్ ను పిలువద్దంటూ ఎమ్మెల్యే స్థానికంగా గ్రూప్ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

మంత్రి మల్లారెడ్డి ప్రారంభించిన దోబీ ఘాట్ ను తిరిగి కార్పొరేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ప్రారంభించడమేమిటనీ మరో వర్గం మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శించారు. కులాలను తెరపైకి తీసుకోస్తూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారనీ, ప్రొటోకాల్ విస్మరించింది కార్పోరేటర్ శ్రీదేవేనంటూ మరో వర్గం విమర్శించింది. ఎమ్మెల్యేపై లేనిపోని నిందలు వేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కాగా మూడేళ్లుగా చర్లపల్లి డివిజన్‌లో కార్పొరేటర్ కు ఏమ్మెల్యే తగిన ప్రాధాన్య కల్పించకుండా ఒంటెద్దు పోకడలకు పాల్పడుతున్నాడని, తామంతా టీఆర్ ఎస్ గొడుగు కింద పనిచేస్తుంటే వర్గాలు విభజించి కార్పొరేటర్ వర్గమని ఎమ్మెల్యే ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమని డివిజన్ మాజీ అధ్యక్షులు విద్యాసాగర్ ప్రశ్నించారు. రెడ్డి సమాజిక వర్గాన్ని కించపర్చేలా కార్పొరేటర్ వ్యవహరించలేదని, కొందరు కావాలనే చిచ్చు పెడుతున్నారని ఉద్యమ కారుడు నాగిళ్ళ బాల్ రెడ్డి తెలిపారు. బీసీల పట్ల ఎమ్మెల్యే వివక్షత చూపుతున్నాడనీ, విభజించి పాలించే విధానాన్ని విడనాడి అందర్ని కులుపుకుపోయేలా వ్యవహరించాలని కనకరాజ్ గౌడ్ కోరారు. పార్టీ అదిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు తాము పనిచేస్తున్నామని అలాగే పనిచేస్తామని వ్యక్తులతో కాకుండా పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు పార్టీ కోసం పనిచేస్తామన్నారు.


Next Story

Most Viewed