ట్రాఫిక్​ సమస్య తీర్చేందుకు వెళ్లి....

by Disha Web |
ట్రాఫిక్​ సమస్య తీర్చేందుకు వెళ్లి....
X

దిశ ,శామీర్ పేట : డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్రగాయాలైన సంఘటన శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ రహదారిపై శుక్రవారం చోటు చేసుకుంది. శామీర్ పేట పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం శామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో పెట్రోలింగ్​ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ షరీఫ్ (26) అచ్చాయిపల్లి ఎక్స్ రోడ్డు వద్ద లారీలు ఢీకొట్టుకొన్నాయని తెలుకొని ఘటన స్థలానికి చేరుకుని రాజీవ్ రోడ్డుపై నిలిచిన ట్రాఫిక్​ సమస్యను తొలగిస్తున్నాడు. ఆ సయయంలో ఓగుర్తు తెలియని కారు కానిస్టేబుల్ షరీఫ్​ను ఢీకొట్టింది. దీంతో తలకు బలమైన గాయంకాగా డ్రైవర్ హోంగార్డు గోపికి స్వల్పగాయాలయ్యాయి. కానిస్టేబుల్ ను నగరంలోని యశోద ఆస్పత్రికి తరలించారు. శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story