- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వండి..
జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా శాఖకు విజ్ఞప్తి చేసింది.

దిశ, మేడ్చల్ బ్యూరో: జర్నలిస్టుల పిల్లలకు పాఠశాలల్లో 50 శాతం రాయితీ కల్పించేలా ప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియుడబ్ల్యూజే- ఐజేయు) మేడ్చల్ జిల్లా శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జర్నలిస్టులు మంగళవారం జిల్లా విద్యాధికారి (డిఈఓ) రేణుకా దేవిని కలిసి వినతిపత్రం అందజేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను జిల్లా పరిధిలోని వివిధ పాఠశాలల్లో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు రాయితీ ఇచ్చేలా తగు సూచనలతో ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన డిఇఓ వెంటనే తగు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఎవరైనా జర్నలిస్టులు తమ పిల్లలకు ఫీజు రాయితీ కోరుతూ ఆయా పాఠశాలల పేరుమీద వ్యక్తిగతంగా లెటర్ కావాలనుకునేవారు నేరుగా జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని విద్యాశాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే( ఐజేయు ) రాష్ట్ర కోశాధికారి మోతే వెంకట్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజ్, జిల్లా కార్యదర్శి దొంతుల వెంకట్రాంరెడ్డి, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రవిచంద్ర, జిల్లా జర్నలిస్టు నాయకులు రామారావు, ప్రసాద్, భూపాల్, నరోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






