నిజాంపేట్‌లో గ్యాస్ లీక్ కలకలం

by Disha WebDesk |
నిజాంపేట్‌లో గ్యాస్ లీక్ కలకలం
X

దిశ, కుత్బుల్లాపూర్ : నిజాంపేట్‌లో గ్యాస్ లీక్ ఘటనలు పునరావృతం అవుతున్నాయి. కొద్ది నెలల క్రితం నిజాంపేట్ గాయత్రి టవర్స్ వద్ద పైప్ లైన్ పగిలి లీక్ అయిన సంఘటన మరువక ముందే నేడు నిజాంపేట్ జర్నలిస్ట్ కాలనీలో రోడ్డు వెడల్పు పనులు చేస్తుండగా భాగ్యనగర్ గ్యాస్ పైప్ లైన్ పగిలి గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ తో కాలనీలో ప్రజలు భయాందోళన చెందారు. స్థానికులు బాచుపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, వారు సంఘటన స్థలానికి చేరుకొని భాగ్యనగర్ గ్యాస్ సరఫరా ఆపరేటర్ ను పిలిపించి గ్యాస్ వాల్ మూయించి గ్యాస్ సరఫరా నిలిపివేశారు. ఎస్ ఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రజలు ఎవ్వరు గ్యాస్ పైప్ లైన్ దగ్గరికీ వెళ్లకుండా రోడ్డు క్లోజ్ చేసి భద్రత చర్యలు చేపట్టారు. గ్యాస్ లీక్ ఆగిపోయి సాధారణ పరిస్థితి కలగడంతో స్థానికులు ఊపిరి పీల్చులున్నారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed