జనవరి 18 నుంచి రెండో విడత 'కంటి వెలుగు' : కలెక్టర్ హరీశ్

by Disha Web Desk 15 |
జనవరి 18 నుంచి రెండో విడత కంటి వెలుగు : కలెక్టర్ హరీశ్
X

దిశ ప్రతినిధి,మేడ్చల్ : కంటి సమస్యలను దూరం చేసేందుకు రాష్ట్ర సర్కార్ మరోసారి 'కంటి వెలుగు'కు శ్రీకారం చుట్టింది. రెండో విడుత 2023, జనవరి 18 నుంచి ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర వైద్యరోగ్యా శాఖ మంత్రి హరీశ్ రావు కంటి వెలుగుపై జిల్లా కలెక్టర్లు, వైద్యారోగ్య ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీశ్, వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ.. రెండో విడత కంటి వెలుగుకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా జనవరి 18వ తేదీన ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 27,75,067 మందికి పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని వివరించారు.

75 ప్రత్యేక బృందాలు..

జిల్లా వ్యాప్తంగా 75 బృందాలను నియమించినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ 40 వార్డులలో 43 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే జిల్లాలోని 61 గ్రామపంచాయతీలకు గాను 10 బృందాలను, 4 కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీ ప్రాంతాలలో 13 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా మరో నాలుగు అదనపు బృందాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అవసరమైన ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని ఆయా పీహెచ్సీలలోని వైద్యులు, ఆయుష్ వైద్యులు, రాష్ట్రీయ బాల స్వస్థ్ కార్యక్రమం వైద్యులు, ఏఎన్ఎమ్ లు, ఆశా కారకర్తలు అందుబాటులో ఉంటారని కలెక్టర్ పేర్కొన్నారు. అలాగే ఆయా మున్సిపాలిటీలలో వార్డుల వారీగా, మండలాలలో గ్రామ పంచాయతీల వారీగా ఏ రోజు వైద్య శిబిరం ఎక్కడ నిర్వహించేది, వైద్య బృందాలకు ఎక్కడ వసతి ఏర్పాటు చేయాలనే విషయాలపై ముందస్తు ప్రణాళిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి డాక్టర్ కె.ఆనంద్, జిల్లా మాస్ మీడియా అధికారి జి.వేణుగోపాల్ రెడ్డి, డీఎంపీవో మంజుల తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed