రూ. 80 లక్షలతో బీపీఆర్ కాలనీ, ఆర్ఎన్ఎస్ కాలనీ ప్రధాన మార్గం డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

by Kodari Anjali |

బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా పాలన ప్రభుత్వం నిరంతరం నిధులు మంజూరు చేస్తోందని బోడుప్పల్ సర్కిల్ అభివృద్ధే తమ లక్ష్యంఅని మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు.

రూ. 80 లక్షలతో బీపీఆర్ కాలనీ, ఆర్ఎన్ఎస్ కాలనీ ప్రధాన మార్గం డ్రైనేజీ పనులకు శంకుస్థాపన
X

దిశ, మేడిపల్లి: బోడుప్పల్ సర్కిల్ సమగ్ర అభివృద్ధి కోసం ప్రజా పాలన ప్రభుత్వం నిరంతరం నిధులు మంజూరు చేస్తోందని బోడుప్పల్ సర్కిల్ అభివృద్ధే తమ లక్ష్యంఅని మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ తెలిపారు. మంగళవారం బోడుప్పల్ సర్కిల్‌లోని బీపీఆర్ కాలనీ నుంచి ఆర్ఎన్ఎస్ కాలనీ ప్రధాన మార్గం వరకు రూ.80 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అజయ్ యాదవ్ మాట్లాడుతూ, బోడుప్పల్ సర్కిల్ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు తీసుకువచ్చి బోడుప్పల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల నరసింహ రెడ్డి, బీ-బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, సీనియర్ నాయకులు బొమ్మకు రమేష్, మాజీ కార్పొరేటర్లు కొత్త దుర్గమ్మ, బొమ్మకు కళ్యాణ్ కుమార్, కుంభం కిరణ్ కుమార్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు జీ. సమతా యాదవ్, యువజన కాంగ్రెస్ నాయకుడు అసర్ల బీరప్ప, పడతం లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Next Story