ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరైన మాజీ మేయర్

by Kodari Anjali |

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించడంతో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మంగళవారం విచారణకు హాజరయ్యారు.

ఫోన్ ట్యాపింగ్ విచారణకు హాజరైన మాజీ మేయర్
X

దిశ, మేడిపల్లి: గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన ఫోన్ ట్యాప్ అయినట్లు సిట్ అధికారులు గుర్తించడంతో బోడుప్పల్ మాజీ మేయర్ తోటకూర అజయ్ యాదవ్ మంగళవారం విచారణకు హాజరయ్యారు. 2023 అక్టోబర్‌లో తన ఫోన్ నంబర్‌ను ట్యాప్ చేసినట్లు అధికారులు చూపించినట్లు తెలిపారు. గత ఎన్నికల్లో ఆయన తండ్రి తోటకూర వజ్రెష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల కోసం తన ఫోన్‌ను ట్యాప్ చేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. విచారణ అనంతరం అజయ్ యాదవ్ మాట్లాడుతూ, గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిఘా వ్యవస్థలను దుర్వినియోగం చేసి అక్రమ మార్గాల్లో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. తన తండ్రి విజయం దిశగా సాగుతుండటాన్ని తట్టుకోలేక అప్పటి మంత్రి మల్లారెడ్డి కుట్రపూరితంగా ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పోరాటం ప్రజల మద్దతుతో జరగాలని, నిఘా వ్యవస్థలు, అక్రమ ఫోన్ ట్యాపింగ్‌లతో కాదని పేర్కొంటూ, ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై సిట్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story