కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి..: కంటోన్మెంట్ ఎమ్మెల్యే

by Aamani |
కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి..: కంటోన్మెంట్ ఎమ్మెల్యే
X

దిశ, తిరుమలగిరి : నియోజకవర్గ పర్యటనలో భాగంగా మోండా డివిజన్ లోని మహాత్మా గాంధీ హరిజన గిరిజన హౌసింగ్ కాలనీ,శివాజీ నగర్,డొక్కాలమ్మ దొడ్డి లలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సోమవారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలు,పలువురు వ్యాపారస్తులతో మాట్లాడి స్థానికంగా నెలకొన్న సమస్యలు అడిగిన తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీలలో స్థానికులను పలకరించి,పలువురు చిరు వ్యాపారస్తుల తో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కాలనీలో అంగన్వాడీ భవనం లేదని,కమ్యూనిటి హాల్ లో మరో అంతస్తు నిర్మిస్తే కాలనీలోని పేదలకు పలు కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఎమ్మెల్యే అన్నారు.ఈ ప్రాంతంలో ముఖ్యంగా రోడ్లు,డ్రైనేజీ సమస్య ఉందని,గతంలో కన్నా ఇప్పుడు జనాభా బాగా పెరిగి పోయినందున అందుకు తగినట్లుగా డ్రైనేజ్ వ్యవస్థ సరిపోవడం లేదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు.

అక్కడికి అక్కడే సంబంధిత శాఖ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు.స్థానికంగా నెలకొన్న సమస్యలు తీర్చడం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.అభివృద్ది పనులకు సంబంధించి ఇప్పటికే 3కోట్ల నిధులు మంజూరు అయ్యాయని,అంతేకాకుండా ఇంకా నిధులు అవసరమైతే తాను సంబంధిత శాఖ మంత్రులతో,అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని ఎమ్మెల్యే స్థానిక ప్రజలకు హామి ఇచ్చారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం,బీజేపీ కార్పొరేటర్ ఉన్న సమయంలో పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతోనే అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యేతో పాటు జిహెచ్ఎంసి అసిస్టెంట్ ఇంజనీర్ చంద్రశేఖర్,వాటర్ వర్క్స్ ఎఈ మనోహర్,ఎలక్ట్రిక్ సబ్ ఇంజనీర్ కార్తీక్ కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed