ఫీజులే ముఖ్యమా... పిల్లల జీవితాలు పట్టవా.. కళాశాల నిర్వహణపై మహిళా కమిషన్ సీరియస్

by Aamani |
ఫీజులే ముఖ్యమా... పిల్లల జీవితాలు పట్టవా.. కళాశాల నిర్వహణపై మహిళా కమిషన్ సీరియస్
X

దిశ, కుత్బుల్లాపూర్ : ఏం తమాషాగా ఉందా, ధనార్జన తప్ప,విద్యార్థుల జీవితాలపై పట్టింపు లేదా అంటూ రాష్ట్ర మహిళా కమిషన్ బాచుపల్లి నారాయణ కళాశాల యాజమాన్యం పై సీరియస్ అయింది. మేడ్చల్ జిల్లా బాచుపల్లి లోని నారాయణ జూనియర్ కళాశాల హాస్టల్ కనీస వసతులను ఏర్పాటు చేయకుండా విద్యార్థినిల జీవితాలతో ఆటలాడుతోందని కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలో కనీస వసతులు లేవని అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఆమె నారాయణ హాస్టల్ కళాశాలను పరిశీలించారు. హాస్టల్ కళాశాల లో టాయిలెట్స్ వసతులు, బాత్ రూమ్, మంచినీటి సౌకర్యాలు సక్రమంగా లేవని కళాశాల యాజమాన్యంను నిలదీశారు.

కనీస నిబంధనలు, వసతులు పాటించని ఇలాంటి కళాశాలలో వేల మంది జీవితాలను చీకటిలోకి నెట్టుతారా అని ప్రశ్నించారు. మీకూ ఒక్కో విద్యార్థి తల్లిదండ్రుల నుండి ఫీజుల రూపంలో లక్షలు లాగేయడం తప్ప కనీస వసతులు ఏర్పాటు చేసే బాధ్యత లేదా అని ఫైర్ అయ్యారు.కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను అక్కడ ఇద్దరవుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. మహిళా కమిషన్ దృష్టికి పలు సమస్యలు విద్యార్థులు తీసుకుపోయారు.కళాశాల నిర్వహణలో మార్పులు రాకపోతే చర్యలు తీసుకునేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed