నేటి నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ

by Disha Web Desk 23 |
నేటి నుంచి బతుకమ్మ చీరలు పంపిణీ
X

దిశ,మేడ్చల్ ప్రతినిధి: ప్రతి సంవత్సరం మహిళలకు దసరా కానుకగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఇందుకోసం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సంబంధిత కేంద్రాలకు బతుకమ్మ చీరలను అధికారులు తరలించారు. బుధవారం నుంచి ఆయా కేంద్రాలలో లబ్ధిదారులు ధ్రువీకరణ పత్రాలను చూపించి దసరా కానుకను ఉండవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లా వ్యాప్తంగా నాలుగు లక్షల 40 వేల చీరలు..

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలలో మొత్తం నాలుగు లక్షల 40 వేల చీరలను లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. జిల్లావ్యాప్తంగా ఏడు లక్షల 24 వేల తొమ్మిది వందల తొంబై ఐదు మంది లబ్ధిదారులు ఉన్నప్పటికీ వారిలో 4 లక్షల 40 వేల మందికి చీరలు అందివ్వ నున్నారు. కీసర, మేడ్చల్ రూరల్, ఎం సి పల్లి, షామీర్పేట్ జవహర్ నగర్ దమ్మాయిగూడ నాగారం తూముకుంట అల్వాల్, మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో ఒక లక్ష 4వేల 893 చీరలను కేటాయించారు. అదేవిధంగా ఘట్కేసర్ రూరల్, మల్కాజిగిరి , పోచారం, పిర్జాదిగూడ , బోడుప్పల్ , ఉప్పల్ , నాగోలు , ఘట్కేసర్ మున్సిపాలిటీ, కాప్రా పరిధిలో లక్ష 32 వేల 150 మంది లబ్ధిదారులకు, నిజాంపేట్, దుండిగల్ ,గండి మైసమ్మ ,కొంపల్లి ,గాజులరామారం ,కూకట్పల్లి ,మూసాపేట ,గుండ్ల పోచంపల్లి ,కుత్బుల్లాపూర్ ప్రాంతాలలో రెండు లక్షల 2వేల 956 మంది లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో ఉన్న షామీర్పేట్ లో ఉన్న మండల మహిళా సమాఖ్య భవనం, ఉప్పల్ లో ఉన్న గాంధీనగర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, గాజులరామారం సర్కిల్ భగత్ సింగ్ నగర్ కమ్యూనిటీ హాల్ ఆయా ప్రాంతాలకు చెందిన చీరలను తరలించారు.

మూసాపేట సర్కిల్ పరిధిలో అత్యధిక లబ్ధిదారులు

జిల్లా వ్యాప్తంగా ఉన్న ఐదు నియోజకవర్గాలలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జిహెచ్ఎంసి సర్కిళ్లలో మొత్తం 27 ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా మూసాపేట సర్కిల్ పరిధిలో 78 వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి లబ్ధిదారులు ఉండగా వారిలో 47 వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క లబ్ధిదారులకు బతుకమ్మ చీరలను కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క సర్కిల్లోని అత్యధిక లబ్ధిదారులు ఉన్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో నాలుగువేల 154 మంది లబ్ధిదారులు ఉండగా వీరిలో 2వేల 540 మంది లబ్ధిదారులకు బతుకమ్మ కానుకను ఇవ్వనున్నారు. జిల్లాలో పుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అత్యంత లబ్ధి దారులు ఉన్నట్లు చెబుతున్నారు.

రేషన్ కార్డు .. ఆధార్ నకలు పత్రాలు..

బతుకమ్మ కానుకను బుధవారం నుంచి ఆయా సర్కిళ్ల మున్సిపాలిటీ పరిధిలో కేటాయించిన కేంద్రాల్లో లబ్ధిదారులకు ఇవ్వనున్నారు. దీన్ని పొందేందుకు లబ్ధిదారులు కేంద్రానికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు నకలు పత్రాలుతోపాటుగా ఫోన్ నెంబర్లు కూడా అధికారులకు అందించాల్సి ఉంటుంది. సెలవు రోజులలో తప్ప మిగిలిన రోజులలో ఈ చీరలు ఎప్పటి వరకు ఉంటే అప్పటివరకు పంపిణీ చేస్తామని సంబంధిత అధికారులు పేర్కొన్నారు.



Next Story

Most Viewed