దిశ ఎఫెక్ట్… వివేకానంద కాన్వెంట్​ స్కూల్​ను సందర్శించిన జీహెచ్ఎంసీ, విద్యాశాఖ అధికారులు

by Kalyani |
దిశ ఎఫెక్ట్… వివేకానంద కాన్వెంట్​ స్కూల్​ను సందర్శించిన జీహెచ్ఎంసీ, విద్యాశాఖ అధికారులు
X

దిశ, కూకట్​పల్లి: నిబంధనలకు పాతర శీర్షికన దిశ పత్రికలో గురువారం ప్రచురితమైన కథనానికి జీహెచ్​ఎంసీ, విద్యాశాఖ అధికారులు స్పందించారు. మూసాపేట్​ సర్కిల్​ పరిధిలోని భరత్​నగర్​ కాలనీలో వివేకానంద కాన్వెంట్​ హై స్కూల్​ యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన 5 అంతస్థుల అక్రమ నిర్మాణంలో పాఠశాలను నిర్వహిస్తున్నారు. జీహెచ్​ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాన్ని నిర్మించడంతో పాటు విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణంలో పాఠశాలను కొనసాగిస్తుండటాన్ని దిశ పత్రిక ప్రచురించింది.

కథనానికి స్పందించిన విద్యాశాఖ జిల్లా అధికారి విజయకుమారి, మండల విద్యాశాఖ అధికారి వసంత కుమారిల ఆదేశాల మేరకు విద్యాశాఖ సిబ్బంది పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. అదే విధంగా మూసాపేట్​ సర్కిల్​ టౌన్​ ప్లానింగ్​ ఏసీపీ మల్లేశ్వర్​ ఆదేశాల మేరకు టిపిఎస్​ మహేందర్​ పాఠశాలను పరిశీలించి, నిర్మాణానికి సంబంధించిన అనుమతుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నట్టు తెలిపారు. నిబందనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణంలో పాఠశాలను నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యానికి శాఖ పరంగా నోటీసులు జారీ చేసి తదుపరి చర్యలు తీసుకునేందుకు విద్యాశాఖ, జీహెచ్​ఎంసీ అధికారులు సిద్ధం అయ్యారు.

Next Story

Most Viewed