దిశ ఎఫెక్ట్: ఆఘమేఘాల మీద ఎంపీవో రిలీవ్ ఉత్తర్వులు..

by Disha Web Desk 11 |
దిశ ఎఫెక్ట్: ఆఘమేఘాల మీద ఎంపీవో రిలీవ్ ఉత్తర్వులు..
X

దిశ ప్రతినిధి, మేడ్చల్: శామీర్ పేట ఎంపీడీవో గరుదాస్ వాణి ఆగమేఘాల మీద రిలీవ్ ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రాత్రి ‘కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు‘ అనే శీర్షీకతో ‘దిశ’ వెబ్ సైట్ లో వచ్చిన కథనం జిల్లా అధికార వర్గాల్లో తీవ్ర దుమారాన్నే రేపింది. దీనిపై జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ఆరా తీసినట్లు తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులను కలెక్టర్ మందలిస్తూ.. తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అదేశాలు జారీ చేసినట్లు సమచారం. దీంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి ఎంపీడీవో వాణిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కలెక్టర్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించినట్లు తెలిసింది.

కలెక్టర్ ఆర్డర్ ప్రకారం శామీర్ పేట నుంచి ఎంపీవో బానోతు రవిని రిలీవ్ చేయాలని, అదేవిధంగా బదిలీపై వచ్చిన మంగతాయరు ను డ్యూటీలో చేర్చుకోవాలని అదేశించినట్లు తెలిసింది. దీంతో ఎంపీడీవో వాణి బుధవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఎంపీవో రవికి రిలీవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీడీవో రిలీవ్ ఆర్డర్ ఇవ్వడంతో రవి మేడ్చల్ ఎంపీవోగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా శామీర్ పేట ఎంపీవోగా మంగతాయరు బాధ్యతలు తీసుకున్నారు. దీంతో గత 15 రోజులుగా ఎంపీవోల మార్పు విషయమై జరుగుతున్న పైరవీలకు ‘దిశ‘ కథనంతో తెరపడింది.

శామీర్ పేటలో కూల్చివేతలు..

శామీర్ పేటలోని అలియా బాద్ లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను గురువారం కూల్చివేశారు. ’దిశ‘లో ప్రచురితమైన కథనాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య సీరియస్ గా తీసుకున్నారు. ఎంపీవో రవిని శామీర్ పేటలోనే కొనసాగించాలని ఎంపీపీ ఎల్లుభాయి, ఎంపీడీవో వాణిలు ఒత్తిడి తెస్తుండడంపై అదనపు కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నట్లు తెలిసింది. దీంతో శామీర్ పేటలో అసలు ఏమి జరుగుతుంది.. ? ఆక్రమణలు, అనుమతి లేని నిర్మాణాలు ఎన్ని ఉన్నాయి.. వాటిని గుర్తించి తక్షణమే కూల్చివేయాలని డీపీవో రమణమూర్తిని అదనపు కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. అదనపు కలెక్టర్ అదేశాల మేరకు అలియాబాద్ లో పంచాయతీ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు.



Next Story

Most Viewed