- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
డబుల్ బెడ్ రూమ్‌ల వద్ద స్థానికుల ధర్నా..
దిశ,కంటోన్మెంట్ : మూసీ నిర్వాసితులకు ఖార్కానా లో ఖాళీగా ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అప్పగిస్తున్నారన్న సమాచారంతో మడ్ ఫోర్డ్ డబుల్ బెడ్ రూమ్ గదుల ఇళ్ల సముదాయం వద్ద మంగళవారం స్థానికులు ఆందోళన కు దిగారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు.స్థానికంగా ఉన్న లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించకుండా మూసీ నిర్వాసితులకు ఇవ్వడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం రెవెన్యూ అధికారులు మూసి నిర్వాసితుల కోసం ఇళ్లను సర్వే చేసి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్నా స్థానికంగా ఉన్న తమకు ఇల్లులు కేటాయించలేదని బయట వ్యక్తులకు ఇల్లు కేటాయిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
ధర్నాకు కూర్చున్న స్థానిక ప్రజలకు బీజేపీ నాయకుడు బిఎన్ శ్రీనివాస్ మద్దతు తెలిపి స్థానికులకే ఇళ్లను కేటాయించాలని గత ప్రభుత్వం మాదిరిగా అవకతవకలు జరగకుండా స్థానికులకే కేటాయించాలని కోరారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ధర్నా చేస్తున్న వారి వద్దకు వచ్చి అధికారులతో మాట్లాడి సముదాయించారు. స్థానిక ఎమ్మార్వో తో ఫోన్ లో మాట్లాడి రెవెన్యూ అధికారులు ఎవరు వచ్చారని ఆరా తీస్తే ఎవరు రాలేదని స్థానికులకు చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. స్థానిక మాజీ బోర్డు సభ్యురాలు అనిత ప్రభాకర్ ను వెంటనే స్థానికుల లిస్ట్ తనకు ఇవ్వాలని వీరి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.బీఆర్ఎస్ నాయకురాలు నివేదిత బాధితుల పక్షాన నిలిచి ధర్నాలో పాల్గొని వారికి న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.