- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
‘దిశ’ ఎఫెక్ట్.. లక్ష్మి శ్రీనివాస్ సంస్థ విల్లాల కూల్చివేత
దిశ, మేడ్చల్ బ్యూరో /దుండిగల్: అక్రమ కట్టడాలపై అధికార యంత్రాంగం కొరఢ ఝుళిపించింది. మేడ్చల్ జిల్లా, దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లంపేటలో నిర్మిస్తున్న అక్రమ విల్లాలను కూల్చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. మల్లంపేట గ్రామ సర్వేనెంబర్ 170/6లోని 2946.07 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో లక్ష్మి శ్రీనివాస్ అనే నిర్మాణ సంస్థ తప్పుడు పత్రాలను సృష్టించి,వైడ్ నెంబర్.002095/హెచ్ఎండీఏ/0433/ఎంఈడి/2023 పేరిట 2023, మే 4 న 17 విల్లాలకు హెచ్ఎండీఏ అనుమతులు పొందింది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో గతంలో అక్రమంగా నిర్మిస్తున్న విల్లాలను కూల్చివేశారు. అంతేకాకుండా జాయింట్ సర్వే నిర్వహించి హెచ్ఎండీఏ అనుమతులు రద్దు చేయాలంటూ 2024,ఏప్రిల్ 15 న దుండిగల్ తహసీల్దార్, హెచ్ఎండీఏ కమిషనర్ కు లేఖ కూడా రాశారు.అధికారులు ఆ స్థలంలో ఇది ప్రభుత్వ స్థలమని, ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ పలుమార్లు బోర్డులను కూడా పెట్టారు. అయితే ఇప్పటికి నాలుగైదు సార్లు పెట్టిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు మాయమవడం.. తిరిగి రెవెన్యూ అధికారులు బోర్డులు పెట్టడం పరిపాటిగా మారింది.
లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ ప్రభుత్వ భూమిని అక్రమించి సాగిస్తున్న భూ దందాపై ‘దిశ’ దినపత్రిక వరుస కథనాలను ప్రచురించింది.అయితే లక్ష్మి శ్రీనివాస్ సంస్థ యాజమాన్యం నాట్ టు ఎంటర్ ఫెయిర్ అని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చినట్లు అధికార యంత్రాంగాన్ని హెచ్చరిస్తూ తాజాగా బోర్డును ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న రెవెన్యూ, మున్సిపల్ అధికారులు మంగళవారం ఉదయమే లక్ష్మి నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న అక్రమ విల్లాలను భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చేశారు. దుండిగల్ ఇన్ స్పెక్టర్ సతీష్, ఎస్సై రామ్మోహన్ రెడ్డి, పోలీసుల పహారాలో కూల్చివేతలు చేపట్టారు.డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ ప్రదీప్ రెడ్డి సమక్షంలో కూల్చివేతలు చేపట్టారు. అయితే బాధితులు లక్ష్మి శ్రీనివాస్ సంస్థ విల్లాల కోసం తమను మోసం చేసి రూ. కోట్లు వసూలు చేశారని ఘటన స్థలంలో ఆవేదన వ్యక్తంచేశారు. అయితే లక్ష్మి శ్రీనివాస్ నిర్మాణ సంస్థ కబ్జా కు యత్నించిన రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రక్షించాలని, కబ్జా దారుల పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.