దేశాన్ని సైనికులు.. ప్రజలను పోలీసులు కాపాడుతున్నారు

by Mahesh |
దేశాన్ని సైనికులు.. ప్రజలను పోలీసులు కాపాడుతున్నారు
X

దిశ, మేడిపల్లి: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మేడిపల్లి పోలీస్ వారి ఆధ్వర్యంలో సురక్ష దినోత్సవం కార్యక్రమాన్ని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ సమాధార్భంగా పలువురు పోలిసు వ్యవస్థలో వచ్చిన పలు మార్పులను వివరించారు, ఫ్రెండ్లీ పోలీస్ వల్లే పలువురు ధైర్యంగా పోలీసుస్టేషన్ మెట్లు ఎక్కుతున్నారని అన్నారు.

పీఎంసీ మేయర్ జక్క వెంకటరెడ్డి మాట్లాడుతూ.. తుపాకీ కానీ.. లాఠీ కానీ వాడే అధికారం ఒక్క పోలీసులకు మాత్రమే మన రాజ్యాంగం కలిపించిందని.. పోలీసు వ్యవస్థ కరెక్ట్‌గా పనిచేస్తేనే.. అన్ని వ్యవస్థలు సక్రమంగా పని చేస్తాయన్నారు. మన ప్రభుత్వం అధునాతనమైన ఆయుధాలు సమకూర్చి పకడ్భందీగా పోలీస్ వ్యవస్థను నడిపిస్తుందని, అలానే మినిమమ్ మెంటనెన్స్ కోసం కొంత ఫండ్ ప్రతి పోలీసుస్టేషన్‌కు కేటాయించారాని అన్నారు. కోటిన్నర వ్యయంతో పీర్జాదిగూడలో సీసీ కెమెరాల వ్యవస్థ ఏర్పాటు చేయటం జరిగింది. మేడిపల్లి సీఐ గోవర్ధన గిరి అన్ని వర్గాల వారితో మంచిగా ఉంటూ.. సమస్యలు పరిష్కరిస్తున్నారని, కుటుంబ సమస్యలు పై బాధితులకు అవహగాహన.. కౌన్సిలింగ్ ఇస్తూ వారి కుటుంబాలలో వెలుగు నింపుతున్నారని కొనియాడారు.

సీఐ గోవర్ధన గిరి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం పదేండ్లలో పోలీసు వ్యవస్థలో చేపట్టిన మార్పులు, శాంతి భద్రతల పరిరక్షణకు అమలు చేస్తున్న విధి విధానాలు, సాధించిన విజయాలు, పోలీసు వ్యవస్థలో వివిధ విభాగాల పనితీరు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన దేశంలోని అత్యుత్తమ 74 పోలీస్ స్టేషన్ల జాబితాలో మేడిపల్లి పోలీస్ స్టేషన్ ఉండటం మనందరికీ గర్వకారణం అన్నారు. మీ చుట్టూ జరిగే అసాంఘిక కార్యక్రమాలు, సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో 100కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

2వ వార్డు కార్పొరేటర్ సుభాష్ నాయక్ మాట్లాడుతూ.. 20 సంవత్సరాల నుండి పోలీస్ వ్యవస్థ చూస్తున్నాం. గతంలో ఉప్పల్ వెళ్లి ఫిర్యాదు చేయాల్సి వచ్చేది.. మేడిపల్లిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు వల్ల అ సమస్య తీరిపోయిందని .. పీఎంసీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి ముందు చూపుతో అనేక కాలనీలో సీసీ ఏర్పాటు చేశారు... వచ్చిన సీఐ లు అందరూ మేడిపల్లి అభివృద్ధికి తమవంతు సహాయం అందించారని అన్నారు.

కార్పొరేటర్ ఈశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉన్నతమైన న్యాయం దొరుకుతుందని, ఇక్కడ ప్రతీ కేసు కోర్టుకు వెళ్లకుండా స్టేషన్ లోన్ సమస్యలు పరిష్కరిస్తున్నారని అన్నారు.

హెడ్ మాస్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ఇక్కడ మేయర్.. కార్పొరేటర్లు పోలీస్ వ్యవస్థ తమ పాఠశాలకు ఎంతో చేశారని మాకందరికి జీతాలు ఇస్తున్నారు.. కానీ మన పోలీసులకు జీతంతో పాటు ప్రాణభయం ఉంటుందని అన్నారు.

25 వ వార్డు కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ .. తాను పోలీస్ డిపార్ట్మెంట్ నుండే వచ్చానని.. ఒకప్పుడు పోలీసులకు జీతాలు సరిపడేవి కాదని, తన స్నేహితుని బైక్‌లో పెట్రోల్ కొడితేనే ఎక్కించు కునేవారని.. అప్పుడు పోలీస్ స్టేషన్‌లలో వాష్ రూమ్స్ పోలేక.. సినిమా ధియేటర్లో వెళ్లే వాళ్ళమని, తెలంగాణ ఏర్పడ్డాక పోలీస్ స్టేషన్ వ్యవస్థలో పెను మార్పులు సంభావించయన్నారు. ఈ కార్యక్రమం లో పోలీసులు, కార్పొరేటర్లు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Next Story

Most Viewed