చెత్త కనిపిస్తే సహించేది లేదు.. డీసీ నాగమణి

by Disha Web Desk 21 |
చెత్త కనిపిస్తే సహించేది లేదు.. డీసీ నాగమణి
X

దిశ, అల్వల్​: రోడ్లపై చెత్త కనిపిస్తే సహించేదిలేదని అల్వాల్​ సర్కిల్​ డిప్యూటీ కమిషనర్​ నాగమణి అన్నారు. శనివారం సర్కిల్​ కార్యాలయంలో రాంకీ ఫీల్డ్​ అసిస్టెంట్​లు, ఎస్​ఎఫ్​ఎలతో డీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వచ్ఛ అల్వాల్​ కార్యక్రమంలో భాగంగా చెత్త రహిత అల్వాల్​ను రూపొందించాలని కోరారు. రోడ్లపై ఎక్కడ చెత్త కనిపించకుండా ఫీల్డ్​ సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలన్నారు. బస్తీలు కాలనీలతో పాటు ప్రధాన రహదారులపై ఎక్కడ చెత్త కనిపించకుండా చూడాలని.. కనిపించిన యెడల తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఎంహెచ్​ఓ హరిబాబు, ఎస్​ ఎస్​ ప్రభాకర్​, ఎస్​ఫ్​ఎలు, జవాన్లు పాల్గొన్నారు.


Next Story