ఎర్రకుంట కబ్జాలను అరికట్టండి : ఆకుల సతీష్

by Aamani |
ఎర్రకుంట కబ్జాలను అరికట్టండి : ఆకుల సతీష్
X

దిశ, కుత్బుల్లాపూర్ : బాచుపల్లి ఎర్రకుంట కబ్జాలను అరికట్టాలని నిజాంపేట్ బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్ డిమాండ్ చేశాడు.బాచుపల్లి మండలం లో కుంటలు,చెరువులను బిల్డర్స్ దర్జాగా కబ్జా చేస్తూ వ్యాపారం చేస్తున్నప్పటికీ ఇరిగేషన్,రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోవడం దారుణమని వాపోయారు.విలువైన ప్రకృతి వనరులను లూటీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ బాచుపల్లి లో బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.బాచుపల్లి సర్వేనెంబర్ 134 లో 3 ఎకరాల చెరువు స్థలం రోజుకింత చొప్పున కబ్జాలు చేస్తూ ప్రైవేట్ నెంబర్ వేసి హెచ్ ఎం డీ ఏ అనుమతులు తెచ్చుకుని నిర్మాణాలు చేపడుతున్నారని అన్నారు. చెరువు కబ్జాలకు సహకారం అందిస్తున్న ఇరిగేషన్ ఏడీ, ఏఈ లపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed