అక్రమ షెడ్లతో బోడుప్పల్ కార్పొరేషన్ కు భారీగా నష్టం

by Dishafeatures2 |
అక్రమ షెడ్లతో బోడుప్పల్ కార్పొరేషన్ కు భారీగా నష్టం
X

దిశ, మేడిపల్లి: బోడుప్పల్ లో అక్రమ షెడ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. భారి అక్రమ షెడ్లనిర్మాణాలు జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారుల తీరు పలు అనుమానాలకు తావిస్తోంది. మీడియాలో ఎన్నో కథనాలు వస్తున్నా సార్ కి పట్టింపే లేదు, నాయకుల అండదండలు పుష్కలంగా ఉండటంతో వార్తలపై స్పందన లేదని ప్రజలు అంటున్నారు. ''అందినకాడికి దోచుకుంటూ అటువైపు కన్నేత్తి చూడరట.. నిర్వాహులు అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అడిగె వారె ఉండరట. అక్కడ టౌన్ ప్లాన్ అధికారుల తీరు వారు ఆడిందె ఆట పాడిందె పాటగా సాగుతుంది '' అని స్థానికులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. బోడుప్పల్ 2 వ డివిజన్ చెంగిచర్ల నుండి చర్లపల్లి వెళ్ళె ప్రధాన మార్గం లో వరుసగా మార్బుల్స్, గ్రానెట్స్ షాపుల అక్రమ భారీ షెడ్ల నిర్మాణాలు అధికారుల అండదండలతో జరుగుతున్నాయి. పెద్ద షెడ్లు నిర్మిస్తే హెచ్ఎండీఏ పర్మిషన్ తప్పకుండా తీసుకోవాలని నిబంధనలు ఉన్నప్పటికీ వాళ్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్లు నిర్మాణాలు చేపడుతున్నారు..


మొదటగా ఖాళీ ప్రాంతాన్ని లీజుకు తీసుకుని, దశలవారిగా నిర్మాణాలు పూర్తి చెస్తున్నారు. ఇలాంటి నిర్ణాణాలు అక్కడ పదుల సంఖ్యలో కనిపిస్తాయి. కొన్ని షెడ్ల నిర్మాణాలు పూర్తయి సంవత్సరాలు గడిచిపోయాయి. ఇంత జరుగుతున్నా అధికారులు అటువైపె కన్నేత్తి చూడకపోవటం విడ్డూరంగా ఉంది. అక్రమ నిర్మాణాలపై వారి దృష్టికి వస్తే సదరు నిర్మాణాలకు ముందస్తుగా టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇవ్వాలి. నోటిస్ ఇచ్చినా స్పందన రాకపోతే ఆ నిర్మాణాన్ని కూల్చేయాల్సిందిగా టాస్క్ ఫోర్స్ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్తారు. కానీ అట్టి నిర్మాణాన్ని పూర్తిగా ఆపివేయడం లేదా కూల్చివేసే రీతిగా ముందుకు వెళ్ళరు. కానీ ఇక్కడ అక్రమ నిర్మాణాల విషయంలో తమ తప్పు ఏమీ లేదు అనిపించుకునే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు. దీంతో నిర్మాణ దారులు చెలరేగిపోతున్నారు. అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లాన్ వాళ్ళను ప్రశ్నిస్తే లిస్ట్ తయారైందని, పై అధికారులు సంతకాలు చేయలేదని చెబుతున్నారు. టీపీవో కి తెలిసె ఇవన్ని జరుగుతున్నాయా లేక నాయకుల అడదండలతో జరుగుతున్నాయా అనేది తెలియాలి. బలహీనుల పై తమ ప్రతాపం చూపే అధికారులు ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై అసలు మతలబు ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎందరికో గుబులు పుట్టించిన బోడుప్పల్ కమిషనర్ ఇటువైపు కూడ ఒకసారి వస్తే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. టౌన్ ప్లాన్ అధికారి వీరాస్వామి వివరణ అడగగా ఇప్పటికే పర్మిషన్ లేనివాటిని గుర్తించామని, పై అధికారుల సంతకాలు చేయలేదని, త్వరలోనే నోటీసులు ఇస్తామని చెప్పారు.





Next Story

Most Viewed