వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: కేఎల్ఆర్

by Disha Web Desk 23 |
వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే: కేఎల్ఆర్
X

దిశ,తాండూరు : ఎవరు అధైర్య పడొద్దని, వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే నని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.టీపీసీసీ సీనియర్ సభ్యులు రమేష్ మహారాజ్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, తాండూర్ ఇంచార్జి కేఎల్ఆర్ ల ఆధ్వర్యంలో సోమవారం తాండూరు పట్టణంలో కాంగ్రెస్ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఇందిరానగర్ వార్డులో ఇంటింటికి తిరిగి బీఆర్‌ఎస్‌ పథకాల వైఫల్యాలను తెలియజేస్తూ కాంగ్రెస్‌ ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను కాలనీవాసులకు వివరించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు ఇస్తామని, ఇండ్లు కట్టిస్తామని, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, ఇలా పలు హామీలు ఇచ్చారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని, రైతులతో పాటు కౌలు రైతులకు పెట్టుబడి సహాయం సంవత్సరానికి 15 వేల రూపాయలు అందజేస్తుందని, పోడు భూములు, అసైన్డ్ భూములు గల రైతులకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని, భూమిలేని ఉపాధి హామీ రైతు కూలీలకు ఏడాదికి 12 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని, రైతు పండించిన ప్రతి పంటకు మద్దతు ధర ఇచ్చి కొనుగులు చేస్తుందన్నారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసపూరితమైన మాటలు నమ్మవద్దని కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.తాండూరులో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హబీబ్ లాల, రాకేష్ మహారాజ్, దారా సింగ్,ప్రభాకర్ గౌడ్, ఉత్తమ చంద్, జనార్దన్ రెడ్డి, మధుబాల,వివిధ మండల పార్టీ అధ్యక్షుడు, అశోక్ కుమార్, జగదీష్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Next Story