- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
త్వరలో డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక: కలెక్టర్

దిశ ప్రతినిధి,మేడ్చల్: అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మేడ్చల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.హరీశ్ అన్నారు. వచ్చే సంవత్సరం జనవరి 15 లోపు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ తన చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ పరిధిలో మినహా రూరల్ జిల్లా వ్యాప్తంగా 2,350 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు కాగా, 881 ఇండ్లకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు. వీటిలో 803 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసి, అర్హులైన లబ్ధిదారులకు అందచేసినట్లు కలెక్టర్ హరీశ్ వివరించారు.
ధరణీ సమస్యలు వేగవంతం..
దరణీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్లుతున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 13వేల ధరణి సమస్యలుంటే వాటిలో 75 శాతం వరకు పరిష్కరించామని తెలిపారు. అదేవిధంగా నిషేధిత జాబితా(పీవో)స్థలాల సమస్యను కూడా ఓ కొలిక్కి తెస్తున్నట్లు తెలిపారు. సామూహికంగా ఆ సమస్యను ఓకేసారి పరిష్కరించనున్నట్లు తెలిపారు.
వారంలోగా 58,59 జీవో దరఖాస్తులు పూర్తి..
అలాగే 58 జీవోకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 38 వేల దరఖాస్తులు రాగా, వాటిని త్వరితగతిన పరిశీలిస్తున్నామని తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియను డిసెంబరు 5వ తేదీ వరకు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దీంతో పాటు 59 జీవోకు సంబంధించి జిల్లాలో 28, 280 దరఖాస్తులు వచ్చాయని, డిసెంబర్ 10వ తేదీ వరకు పూర్తి చేసి పూర్తి వివరాలను ప్రభుత్వానికి సమర్పిస్తామని కలెక్టర్ హరీశ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మేరకు అన్ని పనులు చేపడుతున్నామని తెలిపారు.భూ సంబంధిత సమస్యలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.