- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
డాక్టర్ శ్రీదేవికి ఉత్తమ ఆఫీసర్ అవార్డు
by Sridhar Babu |
X
దిశ, మేడ్చల్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల డిస్ట్రిక్ ప్రోగ్రాం ఆఫీసర్ల కోసం ఎర్రగడ్డలోని రాష్ట్ర టీబీ శిక్షణ, ప్రదర్శన కేంద్రంలో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉత్తమ ప్రదర్శన చేసిన ప్రోగ్రాం ఆఫీసర్లను గౌరవించడంతో పాటు, మెడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో ఎన్ టీఈపీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు డా. శ్రీదేవి ని ఉత్తమ ప్రోగ్రాం ఆఫీసర్ అవార్డుతో సత్కరించారు. ఈ అవార్డును కేంద్ర బొగ్గు, గనుల మంత్రి జి. కిషన్ రెడ్డి, తెలంగాణ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్.వీ. కర్ణన్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వైద్యారోగ్య అధికారి డా. టి. రఘునాథ్ స్వామి, జిల్లా తరపున డా. శ్రీదేవి ఈ ప్రాతిష్ఠాత్మక అవార్డు సాధించినందుకు అభినందించారు.
Advertisement
Next Story