పేదింటి పెళ్లికి బండారి లక్ష్మారెడ్డి ట్రస్ట్ చేయూత..

by Dishanational4 |
పేదింటి పెళ్లికి బండారి లక్ష్మారెడ్డి ట్రస్ట్ చేయూత..
X

దిశ, నాచారం: ఓ పేదింటి మహిళ పెళ్ళికి బండారి లక్ష్మారెడ్డి ట్రస్ట్ అండగా నిలిచింది. ఉప్పల్ నియోజకవర్గం మీర్ పేట్ డివిజన్ పరిధిలోని నవోదయ నగర్ కాలనీకి చెందిన భూపతి నర్సింహులు, లక్ష్మి దంపతుల కుమార్తె రేణుక వివాహం జరుగనుంది. ఈ వివాహానికి బండారి లక్ష్మారెడ్డి, చారిటబుల్ ట్రస్ట్ సభ్యుడు గుమ్మడి జంపాల్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ.. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవోదయ కాలనీ ప్రెసిడెంట్ అశోక్ కాలనీ వాసులు ఉపేందర్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed