కేటీఆర్ రోడ్ షోకు హాజరుకానీ బండారి లక్ష్మారెడ్డి

by Disha Web Desk 23 |
కేటీఆర్ రోడ్ షోకు హాజరుకానీ బండారి లక్ష్మారెడ్డి
X

దిశ,ఉప్పల్: ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో ఉప్పల్ రింగ్ రోడ్ లో నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి రోడ్ షో లో కనిపించకపోకయేసరికి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రోడ్ షో పాల్గొనేందుకు వస్తుండగా హబ్సిగూడ ప్రాంతంలో బండారి లక్ష్మారెడ్డి ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. కేటీఆర్ ప్రసంగాన్ని ముగించుకొని వెళ్లిపోయిన తర్వాత బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి హబ్సిగూడ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు నరకయాతన అనుభవించారు. ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయిన అంబులెన్స్ చాలా సమయం ఇబ్బంది పడి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ రాంగ్ రూట్లో చాలా అవస్థలు పడుతూ బయటకు వెళ్ళిపోయింది.మంత్రి కేటీఆర్ కేవలం రెండు నిమిషాలు మాత్రమే ప్రసంగించారు.ఆయన మాట్లాడుతూ ఉప్పల్ ప్రజలను చూస్తుంటే బండారి లక్ష్మా రెడ్డి గెలుపు ఖాయమని అన్నారు. ఉప్పల్ ను చాలా అభివృద్ధి చేశాం.స్కై వాక్ ను పాదాచారుల కోసం అందుబాటులోకి తీసుకోవచ్చాం. మెట్రోను ఈసిఐఎల్ వరకు విస్తరిస్తామని అన్నారు. మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని కోరారు.

Next Story