ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై అవగాహన పెంచుకోవాలి

by Sridhar Babu |
ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై అవగాహన పెంచుకోవాలి
X

దిశ, మేడ్చల్ బ్యూరో : ఇందిరమ్మ ఇండ్ల యాప్ పై అధికారులు సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని మేడ్చల్ జిల్లా అర్ అండ్ బీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, నోడల్ అధికారి వై. శ్రీనివాస్ మూర్తి అన్నారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ పోట్రు ఆదేశాల మేరకు శనివారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్ వార్డు అధికారులకు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ పై అవగాహన కల్పించారు.

ఇందులో భాగంగా ఒక్కో అధికారికి 50 దరఖాస్తులను పరిశీలించేలా లక్ష్యాలను నిర్దేశించారు. ఈ సందర్భంగా శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల యాప్ లాగిన్ ఐడిలు ఇచ్చారని తెలిపారు. ఈ నెల 20 లోపు విచారణ పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed