స్వచ్ఛసర్వేక్షన్ -2023 పై అవగాహన

by Disha Web Desk 15 |
స్వచ్ఛసర్వేక్షన్ -2023 పై అవగాహన
X

దిశ, దుండిగల్ : దుండిగల్ పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ లో మంగళవారం మున్సిపల్ చైర్ పర్సన్ కృష్ణవేణి కృష్ణ అధ్యక్షతన స్వచ్ఛసర్వేక్షన్ 2023 వేస్ట్ టూ హెల్త్, టాయిలెట్ 2.0 పై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పలు తీర్మానాలు చేసి వాటిని ఆమోదించారు. 100 శాతం ఇంటి నుండి చెత్త సేకరణ, సేకరించిన తడి చెత్త మరియు పొడి చెత్త లతో ఆదాయ మార్గాలు అన్వేషించడం, చెత్త డంపింగ్ పాయింట్ లను గుర్తించి ప్రతి రోజూ సుభ్రపరచడం, బయట చెత్త వేసే వారికి ఫెనాలిటీ విధించడం, ప్లాస్టిక్ బ్యాన్ లో భాగంగా షాప్ లలో,మాల్స్ లలో, హోటల్స్ లలో ప్లాస్టిక్ ను వాడకుండా అవగాహన కల్పించడం, సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడిన వారికి కూడా ఫెనాలిటీ విధించడం వంటి అంశాలపై చర్చించారు. మోడల్ టాయిలెట్ వద్ద వాలంటరీ రిజిస్ట్రేషన్లు చేయించడం వంటి వాటిపై అవగాహన కార్యక్రమల ద్వారా ప్రజలకు వివరించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తుడుము పద్మారావు, మున్సిపల్ కమిషనర్ పి. భోగిశ్వర్లు, మేనేజర్ ఎస్. సునంద, రెవెన్యూ ఆఫీసర్ బి. శ్రీహరి రాజు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పి.సాత్విక్, శానిటరీ ఇన్స్పెక్టర్ కె.అంజయ్య, శానిటరీ సూపర్ వైసర్ కె.కరుణాకర్ రెడ్డి, మహిళా RPలు, మున్సిపల్ జవాన్ లు పాల్గొన్నారు.


Next Story

Most Viewed