ఎన్నికల వేళ..తస్మాత్ జాగ్రత్త! తనిఖీల్లో 6 లీటర్ల మద్యం దొరికితే ఇంకా అంతే..

by Aamani |
ఎన్నికల వేళ..తస్మాత్ జాగ్రత్త! తనిఖీల్లో 6 లీటర్ల మద్యం దొరికితే ఇంకా అంతే..
X

దిశ,రాచకొండ : ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలను 24/7 చేశారు. ఈ నేపథ్యంలో పోలీసు బృందాలు నగదు, మద్యం పై ప్రత్యేక దృష్టి ని పెట్టారు. ఈ నేపథ్యంలో పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దావత్ అని చెప్పి ఇష్టమొచ్చినట్లు మధ్యాన్ని తీసుకు వెళ్లుతామంటే కుదరదు అంటున్నారు పోలీసులు. 6 లీటర్లు మించితే ఇక పరేషాన్ .. ఎక్సజ్ శాఖ చట్ట ప్రకారం ఐ ఎమ్ ఎఫ్ ఎల్ (ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ) 4.5 లీటర్ల బీర్లు, 7.5 లీటర్ల కంట్రీ లిక్కర్ ( దేశియా మద్యం ) ను ఒక వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా తీసుకోవచ్చు, తీసుకెళ్లొచ్చు.

దానికి మించి మద్యం కొనుగోలు చేస్తే ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలి లేదంటే చట్టపరమైన చర్యలకు భాద్యులు అవుతారు. ఈ చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు తనిఖీలను ముమ్మరం చేస్తున్నారు. అంతే కాకుండా 6 లీటర్ల మద్యం దొరికితే చాలు కేసు లు పెడుతున్నారు. కాబట్టి ఈ చట్టం మీకు చుట్టుకోవద్దంటే 6 లీటర్లు మించకుండా మద్యం తీసుకువెళ్ళండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేళ ఈ తరహా కేసులు పెరిగాయి. భారీ జరిమానా తో పాటు, చట్ట పరంగా శిక్షలు గట్టిగా ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు.

Advertisement

Next Story