శ్వాసకోస వ్యాధులతో శవాలైతున్న పట్టింపే లేదా?

by Kodari Anjali |

ప్రభుత్వం పట్టించుకోకుంటే పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని జవహర్నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ కో కన్వీనర్లు హెచ్చరించారు.

శ్వాసకోస వ్యాధులతో శవాలైతున్న పట్టింపే లేదా?
X

దిశ, జవహర్నగర్: శ్వాసకోస వ్యాధులతో ప్రజలు శవాలైతున్న ప్రభుత్వానికి ప్రాణాలు కాపాడాలని, పట్టింపులేదా? డంపింగ్ యార్డ్ను పూర్తిస్థాయిలో ఎత్తివేసి ప్రాణాలు కాపాడాలని లేకుంటే ఇంటికో వ్యక్తి సైనికుడిలా పోరాడుతూ ఉద్యమిద్దామని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ కో కన్వీనర్లు పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ చైర్మన్ షేక్ షావలి, కన్వీనర్ ఉమామహేష్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రగతినగర్ లోని నీలు రామచంద్రయ్య భవన్ లో డంపింగ్ భూతాన్ని పారదోరాలని భవిష్యత్ కార్యాచరణపై కో కన్వీనర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండల్ ముదిరాజ్ మాట్లాడుతూ.. డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలు పూర్తిగా కలుషితమయ్యాయని, పశుపక్షాదులు కూడా బ్రతకలేని దుస్ధితి నెలకొందని, చెత్తతో గుట్టలుగుట్టలుగా మారిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని దుయ్యబట్టారు.

డంపింగ్ యార్డ్ విముక్తి కోసం..

దుర్వాసనను భరించలేక ప్రజలు ఇప్పటికే ఇళ్ళను ఖాళీ చేస్తున్నారని, ప్రజల జీవనస్థితిపై రాంకీ అరాచకాన్ని ప్రభుత్వం కూకటివేళ్ళతో కదిలించి ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలని అన్నారు. డంపింగ్ యార్డ్ విముక్తి కోసం ప్రతి ఇంటి నుంచి ప్రజలు స్వచ్ఛంధంగా కదలాలని, పోరాడితేనే మానవ జీవన మనుగడ సాగుతుందని, లేదంటే ప్రశ్నర్ధకంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉందని పలువురు కో కన్వీనర్లు మాట్లాడారు. జులై 26న పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తామని, ప్రతి కాలనీకి డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటపల్లి శంకర్, శివబాబు, అరుణ, సుబ్రమణ్యం, సునీత, సావిత్రి, శివన్నారాయణ, బాల్నర్సింహా, నర్సింహాగౌడ్, లక్ష్మిబాయి, రాంరెడ్డి, చంద్రమౌలి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Next Story