టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు బీఆర్ఎస్ ఏర్పాటు

by Disha Web |
టీఆర్ఎస్ ప్రస్థానంలో మరో మలుపు బీఆర్ఎస్ ఏర్పాటు
X

దిశ, కుత్భుల్లాపూర్: 21 ఏండ్ల తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్థానంలో మరో మలుపు భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావమని మేయర్ నీలారెడ్డి పేర్కొన్నారు. జాతీయ రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పార్టీ ఏకగ్రీవ తీర్మానాన్ని విజయ దశమి సందర్భంగా బుధవారం అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ మేయర్ క్యాంప్ కార్యాలయంలో సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ నాగేష్ చారి, ఎన్ఎంసి టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ నాగరాజ్ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ బైండ్ల నగేష్, సీనియర్ నాయకులు బక్క మల్లేష్, ఎన్ఎంసి టీఆర్ఎస్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రాము, సీనియర్ నాయకులు, యువ నాయకులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed