రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

by Kalyani |
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..
X

దిశ, కూకట్​పల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన కూకట్​పల్లి పోలీస్​స్టేషన్​పరిధిలో ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట్​సాగర్​ హోటల్​ వద్ద కూకట్​పల్లి నుంచి కేపీహెచ్​బీ వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పాడుల శరత్​, బండి రాజులు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తూ మెట్రో పిల్లర్ నెంబర్ 842 వద్ద రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసుల సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతి చెందిన వ్యక్తి వయసు దాదాపు 50 సంవత్సరాల పైబడి ఉంటుందని, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Next Story