- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
బట్టలు కొనుగోలు చేస్తూ కుప్పకూలిన వ్యక్తి మృతి
by Kavitha |
X
దిశ, కూకట్పల్లి : బట్టల దుకాణంలో బట్టలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ఒక్క సారిగా కండ్లు తిరిగి కింద పడి మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రగతినగర్ రాజీవ్‌గృహకల్ప లో నివాసం ఉంటున్న కాల ప్రవీణ్ కృష్ణ గౌడ్(34) హుందాయి షోరూంలో పని చేస్తుంటాడు. బుధవారం ప్రగతి నగర్ రోడ్డులోని ప్రసాద్ ఆసుపత్రి సమీపంలో ఉన్న బట్టల దుకాణానికి వెళ్లి కొనుగోలు చేస్తుండగా ఒక్కసారిగా కుప్ప కూలాడు. బట్టల దుకాణం సిబ్బంది హుటాహుటిన ప్రవీణ్ కృష్ణ గౌడ్‌ను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు వివరాలు సేకరించి ప్రవీణ్ భార్య తేజశ్రీ కు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు.
Advertisement
Next Story