వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా హోటల్ నిర్వహించాలి.. ఎమ్మెల్యే

by Sumithra |
వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా హోటల్ నిర్వహించాలి.. ఎమ్మెల్యే
X

దిశ, అల్వాల్ : వినియోగదారుల అభిరుచికి తగిన విధంగా హోటల్ నిర్వహిస్తే వ్యాపారంలో రాణించవచ్చని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హన్మంతరావు అన్నారు. ఆదివారం మచ్చబొల్లారం డివిజన్ పంచశీల కాలనీలో కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ తో కలిసి గోదావరిని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హోటల్ గోదావరి పలు కార్యక్రమాలకు అనువుగా ఉంటుందని లాడ్జ్ అండ్ బాంక్వెట్ హాల్ పలు శుభకార్యక్రమాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని తెలిపారు.

అభివృద్ది చెందుతున్న అల్వాల్ ప్రజలకు ఇది ఉపయోగం అన్నారు. అనంతరం నిర్వహకులు హన్మంతరావు, సంతోష్, నరేందర్, కరణ్ లను అభినందించారు. ఉద్యోగం వస్తదని ఎవరో వచ్చి ఏదో చేస్తారని వేచిచుడకుండా తమకాళ్ల పై తాము నిలుచుంటూ ఇతరులు నలుగురికి ఉపాధి కల్పించే మార్గాన్ని ఎన్నుకోవడం ఎంతో ఉన్నతమైందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బొబ్బిలి సురేందర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, శ్రీశైలం యాదవ్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, వెంగళరావు, విజయ రెడ్డి, విజయపాల్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story

Most Viewed