ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు

by Dishanational4 |
ఇంట్లో పేలిన గ్యాస్ సిలిండర్.. ఇద్దరికి తీవ్ర గాయాలు
X

దిశ, పేట్ బషీరాబాద్: ఇంట్లో గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్ అవ్వడంతో తండ్రి కూతుళ్లకు తీవ్ర గాయాలు పాలైన సంఘటన జీడిమెట్ల పోలీసులు పరిధిలో చోటుచేసుకుంది. జీడిమెట్ల డివిజన్ కుత్బుల్లాపూర్ గ్రామం హ్యాపీ నెస్ట్ అపార్ట్మెం‌ట్‌లో ఫ్యామిలీ ఉంటున్నారు. సంతోషి వంట రూమ్‌లో టిఫిన్ చేసే పని ముగించుకున్నారు. ఈ క్రమంలోనే వంట రూమ్‌ యూసేజ్ ఏరియా తలుపులు తీసేసరికి ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాల్కనీలో ఉన్న సిలిండర్ పేలి మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న తండ్రి పూజ గదిలో లక్ష్మయ్య గాయాలయ్యాయి. వెంటనే వారిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సిలిండర్ బ్లాస్ట్ ప్రమాదంలో తీవ్ర గాయాలు పాలైన లక్ష్మయ్యకు 75 శాతం కాలిన గాయాలు ఉన్నట్లుగా.. సంతోషికి ముఖం చేతులు తీవ్రంగా కాలిపోయినట్లు బంధువులు తెలిపారు. అయితే గ్యాస్ సిలిండర్‌కు ఉన్న వాషర్ సరిగా లేకపోవడమేనని, దాంతో గ్యాస్ లీకేజీ ఏర్పడిందని స్థానికులు పేర్కొన్నారు.


Next Story

Most Viewed