కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం.. టీపీసీసీ అధ్యక్షుడు మల్లు రవి

by Dishafeatures2 |
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం.. టీపీసీసీ అధ్యక్షుడు మల్లు రవి
X

దిశ, జవహర్ నగర్: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు. గురువారం కార్పొరేషన్ పరిధిలో హాథ్ సే హాథ్ జోడో యాత్రకు మద్దతుగా కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా దళిత విభాగం కన్వీనర్ గండి సునీత ఆధ్వర్యంలో దళిత మహిళా సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ మల్లు రవి, టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి, మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితా రావు, దళిత కాంగ్రెస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు పత్తి కుమార్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ నెల 6 నుండి రాష్ట్రంలో చేపట్టబోయే హాథ్ సే హాథ్ జోడోయాత్రను విజయవంతం చేయాలని కోరారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి దళితునికి భూమి ఉండాలనే ఉద్దేశంతో భూసంస్కరణల చట్టాన్ని తీసుకువచ్చి ప్రతి దళిత కుటుంబానికి వ్యవసాయ భూమిని కేటాయించిన ఘనత కాంగ్రెస్ ది అని అన్నారు.

ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ గృహకల్పల పేరుతో ఎన్నో లక్షల ఇళ్లను నిర్మించి ఇచ్చామని గుర్తు చేశారు. ఉన్నత ఉద్యోగ రంగంలో రిజర్వేషన్లను కల్పించి దళితులకు ఉద్యోగ భద్రత కల్పించామని తెలిపారు. విద్యార్థులకు సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యను అందించామన్నారు. దళితులు రాజకీయాలలో రాణించాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు, పారిశ్రామిక రంగంలో కూడా ఎన్నో రాయితీలను ఇచ్చి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కల్పించిన ఘనత తమ కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ జనరల్ సెక్రటరీలు చరణ్ కౌశిక్, సరిత, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు వేముల మహేష్ గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్, అనంత లక్ష్మీ, దమ్మాయిగూడ, తూంకుంట మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పా రామారావు, భీమిడి జైపాల్ రెడ్డి, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యదర్శి సగ్గు అనిత శ్రీనివాస్,జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రాజనోళ్ళ లక్ష్మీ, నియోజకవర్గ ఎస్సీ సెల్ ఎ,బి బ్లాక్ అద్యక్షులు పానుగంటి మహేష్, కుర్రి మహేష్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్, కన్యారాజు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed