- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డంపింగ్ యార్డ్ ముట్టడికి మహిళల యత్నం..

దిశ, గుమ్మడిదల : గుమ్మడిదల మండలం నల్లవల్లి ప్యారానగర్‌లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు ప్రతిపాదనపై స్థానికుల నిరసనలు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి. 11వ రోజు కూడా రైతు జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగాయి. ఈ క్రమంలో గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో ఆటో ర్యాలీ నిర్వహించిన అనంతరం, మహిళా సంఘాల నేతృత్వంలో భారీ సంఖ్యలో మహిళలు డంపింగ్ యార్డ్ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
డంపింగ్ యార్డ్ వల్ల పర్యావరణ కాలుష్యం పెరిగి ప్రజా ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఆరోపించారు. వ్యవసాయం పై ఆధారపడి జీవనం సాగిస్తున్న తమకు తమ భూములు కలుషితం అవడమే కాక.. నీటి మలినాలు, భూసార నష్టం, ప్రాణహాని సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని రైతు జేఏసీ నేతలు హెచ్చరించారు. ప్రజావ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని, తక్షణ డంపింగ్ యార్డ్ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.