తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు…గంటపాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో

by Kalyani |
తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు…గంటపాటు ఖాళీ బిందెలతో రాస్తారోకో
X

దిశ, చిన్నశంకరంపేట : చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని గాంధీ నగర్ కాలనీవాసులు మూడు రోజుల నుంచి మిషన్ భగీరథ తాగునీరు రాకపోవడంతో మహిళలు ఖాళీ బిందెలతో చేగుంట--మెదక్ ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ… మంచినీరు రావడంలేదని ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎంపీడీవో దామోదర్ ఘటన స్థలానికి చేరుకొని సమస్య పై మాట్లాడి ట్యాంకర్ల ద్వారా మంచినీళ్లు అందిస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.

Next Story

Most Viewed