బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆటో బోల్తా.. ప్రమాదంలో ఓ మహిళ..

by Disha Web |
బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆటో బోల్తా.. ప్రమాదంలో ఓ మహిళ..
X

దిశ చిన్నశంకరంపేట: ఆటో బోల్తా కొట్టడంతో ఆటోలో ఉన్న ఓ మహిళకు రెండు కాళ్లు విరిగిపోయిన సంఘటన శనివారం సాయంత్రం ఏడ్పిల్ వద్ద చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి మెదక్ మండలం గుట్ట కిందిపల్లికి చెందిన గొల్ల కిషన్ ఆటో డ్రైవర్ రెండు రోజుల క్రితం వెల్దుర్తి మండలం లింగాపూర్‌లో ఉన్న బంధువుల ఇంటికి కుటుంబ సమేతంగా ఆటోలో వెళ్లారు. శనివారం సొంత గ్రామానికి వెళుతూ (ఏడ్పిల్) కొండాపూర్ వద్ద ఆటో బ్రేక్ ఫెయిల్ కావడంతో ఆటో బోల్తా కొట్టింది. ఆటో లో ఉన్న డ్రైవర్ భార్య గొల్ల లక్ష్మి రెండు కాళ్ళు విరిగి పోయాయి. కూతురు అఖిల, కిషన్ కు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో అంబులెన్స్ వచ్చి మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. ఈ సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు.
Next Story