- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
104 ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్సీ
104 సర్వీసెస్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు.

దిశ, రామచంద్రాపురం: 104 సర్వీసెస్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ డా. చిన్నమైల్ అంజిరెడ్డి అన్నారు. మంగళవారం రామచంద్రాపురంలో 104 సర్వీసెస్ ఉద్యోగులు ఎమ్మెల్సీని కలిసి ఉద్యోగ భద్రత, పెండింగ్ వేతనాలు, ఇతర సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. ప్రజలకు అత్యవసర ఆరోగ్య సేవలు అందిస్తున్న 104 ఉద్యోగుల సమస్యలు న్యాయమైనవేనని అన్నారు. డీఎంఈ పరిధిలో పనిచేస్తున్న 104 ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులకు గత 14 నెలలుగా జీతాలు అందకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతానని ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 104 ఉద్యోగుల సంఘం ప్రతినిధులు శివరాజ్, వెంకట్ రెడ్డి, కల్పన, వినోద్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.






