- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచాలి: సీఐటీయూ డిమాండ్
కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కంపెనీ యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించారు.

దిశ, జహీరాబాద్: జహీరాబాద్ పట్టణ పరిధిలోని మహీంద్రా ఆండ్ మహీంద్రా పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలను వెంటనే పెంచాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం కంపెనీ యాజమాన్యానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు జహీరాబాద్ క్లస్టర్ కన్వీనర్ ఎస్. మహిపాల్ మాట్లాడుతూ.. గత కొంతకాలంగా పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం..
రాత్రి పగలు కష్టపడుతూ సంస్థ అభివృద్ధికి తోడ్పడుతున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, పని భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించాలని, లేనిపక్షంలో కార్మికులను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం వెంటనే నెరవేర్చాలని వారు కోరారు..ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు, మహీంద్రా అండ్ మహీంద్రా కాంట్రాక్ట్ కార్మిక సంఘం ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.






