- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
సొంత బావమరిది భార్యతో టీఆర్ఎస్ నేత రాసలీలలు.. వీడియో తీసిన ఆమె భర్త

దిశ ప్రతినిధి, సంగారెడ్డి/అమీన్ పూర్: వావి, వరుసలు మరచి ఓ టీఆర్ఎస్ నేత సొంత బావమరిది బార్య(వరుసకు చెల్లెలు)తో సాగిస్తున్న అక్రమ సంబంధం గుట్టురట్టైంది. తన బావ, భార్య సాగిస్తున్న ఈ రాసలీలల బాగోతాన్ని వీడియో చిత్రీకరణతో సహా పట్టుకున్నారు. అనుమానం వచ్చి బెడ్ రూంలో వీడియో ఆన్ చేసి కనిపించకుండా పెట్టడంతో ఇది గుర్తించని ఆ ఇద్దరు రాసలీలల్లో మునిగితేలారు. సాక్షాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టీఆర్ఎస్ నేత తో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
అమీన్ పూర్ మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యురాలి భర్త సమాజం తలదించుకునే ఈ సిగ్గులేని పని చేసి ఇజ్జత్ తీసుకున్నాడు. అమీన్ పూర్ పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. అమీన్ పూర్ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలి భర్త దేవ శిఖామణి స్థానికంగా చర్చిలో ఫాస్టర్‌గా పనిచేస్తున్నారు. కో ఆప్షన్ సభ్యురాలి తమ్ముడు రాజు సాయి భగవాన్ కాలనీలో నివాసముంటున్నారు. రాజు తన బావతో శిఖామణి తో ఆత్మీయంగా ఉండేవారు. రెండు కుటుంబాలు స్థానికంగా ఉండడంతో ఎప్పుడూ కలిసి ఉండేవారు.
ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా శిఖామని రాజు భార్య(వరుసకు చెల్లెలు) కన్నెశాడు. ఆమెను లోబరుచుకుని అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు. ఈ విషయాన్ని అతని భార్య అయిన కో ఆప్షన్ సభ్యురాలికి, రాజుకు తెలియకుండా మేనేజ్ చేశారు. కాగా, గత కొద్ది రోజులు శిఖామణి, తన భార్య పై రాజుకు అనుమానం కలిగింది. ఆ మేరకు సరిగ్గా పదిహేను రోజుల క్రితం రాజు బెడ్ రూములో సెల్ ఫోన్‌లో కెమెరా ఆన్ చేసి కనిపించకుండా పెట్టి బయటకు వెళ్లిపోయాడు.
ఇది గమనించని శిఖామణి, రాజు భార్య ఇద్దరు రాసలీలల్లో మునిగితేలారు. ఆ తరువాత వచ్చిన రాజు ఫోన్‌ల్లో చూసి భార్యను గట్టిగా నిలదీశారు. విషయం తెలిసిపోయిందని భావించిన ఆమె చెప్పాపెట్టకుండా ఆంధ్రాలోని తన తల్లి గారి ఇంటికి వెళ్లిపోయింది.
రాజు దాడి కిడ్నాప్, సెల్ ఫోన్ ధ్వంసం..
తమ అక్రమ సంబంధం బయటపడిందని అందోళన చెందిన శిఖామణి అమీన్ పూర్‌లో ఉన్న రాజును కిడ్నాప్ చేసి రహస్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ తీవ్రంగా కొట్టి సెల్ ఫోన్ లాక్కుని వీడియోలు తొలగించారు. ఫోన్ కూడా ధ్వంసం చేశారు.
బయట ఎవరికి చెప్పినా చంపేస్తామంటూ రాజును శిఖామణి తీవ్రంగా బెదిరించారు. భయంతో అక్కడి నుంచి వెళ్లి ఉదయం వరకు అమీన్ పూర్‌లో తలదాచుకున్న రాజు మరుసటి రోజు ఆంద్రాకు వెళ్లిపోయాడు. 15 రోజుల తరువాత అంటే మంగళవారం నేరుగా అమీన్ పూర్ పోలీసు స్టేషన్‌కు వచ్చి వీడియోలతో సహా ఫిర్యాదు చేశారు. రాజు ఫిర్యాదు మేరకు పోలీసులు శిఖామణితో పాటు రాజు కిడ్నాప్‌లో అతనికి సహకరించిన కిరణ్ గౌడ్, కుంటోళ్ల మల్లేష్, అస్లంఖాన్‌లను కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెళ్లడించారు. వారిని రిమాండ్‌కు తరలించారు.
పార్టీ నుంచి శిఖామణి సస్పెండ్..
టీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా చలామణి అవుతూ.. ఇలాంటి ఘటనకు పాల్పడడం పట్ల పార్టీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వెల్లడించారు. ఇదిలా ఉండగా శిఖామని వ్యవహారం అమీన్ పూర్ అధికార పార్టీతో పాటు స్థానికంగా చర్చానీయాంశమైంది. సొంత బావమరిది భార్య తో రాసలీలలు నడిపిన శిఖామణి పై స్థానికులు దుమ్మెత్తి పోస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
పుట్టిన రోజుకు శాలువాలు, బొకేలు తెస్తే జరిమానా : ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి